మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ అజారుద్దీన్..


Telangana: తెలంగాణ మైనారిటీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ అజారుద్దీన్. 

అక్టోబర్ 31న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్.. ఈ రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మైనారిటీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొని మహ్మద్ అజారుద్దీన్ కు అభినందనలు తెలిపారు.

 ఆగస్టు 30, 2025న అజారుద్దీన్ గవర్నర్ కోటా కింద శాసన మండలి (MLC) సభ్యుడిగా నామినేట్  అయిన విషయం తెలిసిందే. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన అజారుద్దీన్ 16,337 ఓట్లతో ఓడిపోయారు.

రేపు (నవంబర్ 11,2025) జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది.

ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు పట్టం కడుతారనేది నవంబర్ 14వ తేదీన వెల్లడి కానుంది.

0/Post a Comment/Comments